చేనేత కళాకారులకు నిత్యావసరాల పంపిణీ – కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళి అర్పించిన వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ సభ్యులు

వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ చైర్మన్‌ బర్రెంకల మధుసూదన్‌ సూచన మేరకు సభ్యులు జూన్‌ 9న యాదాద్రి జిల్లా వెల్లంకి, సిరిపురం గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యురాలు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ కూతురు వాణి పటాలే సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముందుగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చిప్ప రఘురాములు, కోశాధికారి కందగట్ల స్వామి యాదాద్రి జిల్లా వెల్లంకి గ్రామ చేనేత సహకార సంఘ కార్యాలయ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి నూలు దండ వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామాల్లోని 70 చేనేత కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో పప్పు, వంట నూనె, కారం, సబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. అఖిల భారత పద్మశాలీ సంఘ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్‌, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘ కార్యదర్శి సంగిశెట్టి సాయిబాబా, చేనేత సహకార సంఘ నాయకులు వనం పురుషోత్తం, పున్న నర్సింహ, గంజి రంగయ్య, స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు. Ascenso Finviora

Follow us on social media

Related posts

Leave a Comment