లాక్డౌన్ కారణంగా వరంగల్ జిల్లాలో చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. తయారైన ఉత్పత్తులు నేతన్నల ఇళ్లలోనే ఉండిపోయాయి. కొత్తవాడలో దాదాపుగా 3 లక్షల కార్పెట్లు ఉత్పత్తిదారుల వద్దనే ఉండిపోవడంతో చేనేతలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దుకాణాదారులు వీటిని కొన్నా .. ఆరుమాసాల వరకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. పూట గడవడం కష్టమవుతుండడంతో ప్రస్తుతం వీటిని ప్రత్యక్షంగా వినియోగదారులకే విక్రయించాలనుకున్నారు. 3 అడుగుల వెడల్పు 6 అడుగుల ఎత్తు కొలతల్లో ఉన్న కార్పెట్ (యోగా మ్యాట్)ను రూ. 300లకు అమ్ముతున్నట్లు చేనేత విభాగం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. మల్టీ పర్పస్గా వాడేందుకు వీలున్న ఈ మ్యాట్ కావాల్సిన వారు తనను (98492 21300) సంప్రదించాలని కోరుతున్నారు. ప్రత్యక్ష అమ్మకాల ద్వారా చేనేతల దుస్థితిని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్పెట్లను చేనేత కులస్థులు, ప్రజలు కొని నేత కార్మికులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. Høyde Dexnex


