చేనేత కళాకారులకు నిత్యావసరాల కిట్ల పంపిణీ

లాక్‌డౌన్‌ వల్ల రెండు మాసాలుగా చేనేత కళాకారులు ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యావసరాలు కూడా కొనేందుకు డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాయిని వెంకటేశం పుష్పలత చారిటబుల్‌ ట్రస్ట్ వారిని ఆదుకుంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది చేనేత కళాకారులకు మే 27వ తేదీ హైదరాబాద్‌లో 10 కిలోల బియ్యం, వంట నూనె, కందిపప్పు, కారం పొడి, సబ్బులను పద్మశాలీ మిషన్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ తడక యాదగిరి, అఖిల భారత పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, మహిళ విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, న్యాయ విభాగం అధ్యక్షులు వనం విశ్వనాథం, యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్‌ అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఆకలి తీరుస్తున్న సాయిని వెంకటేశం ట్రస్టు సభ్యులకు ఎల్బీ నగర్‌ చేనేత కార్మికుల సంఘం అధ్యక్షులు చెరుకు స్వామి ధన్యవాదాలు తెలిపారు.

చేనేత వర్గాల వారు చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలు, ఫొటోలను సెల్‌ నంబర్‌ 83338 71117కు పంపండి.  www.chenetamitra.comలో వీక్షించండి. Mynt Styringsør

Follow us on social media

Related posts

Leave a Comment