పోపా ఆధ్వర్యంలో పేద పద్మశాలీ కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు, నగదు పంపిణీ

కరోనా నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పేద పద్మశాలీయులకు పద్మశాలీ అఫీషియల్స్ అండ్‌ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌ (పోపా) అండగా నిలిచింది. రూ. 600 విలువచేసే ఒక్కో నిత్యావసరాల కిట్‌ (బియ్యం, కందిపప్పు, వంటనూనె, కారం, పసుపు, టీ పొడి)ను 80 మంది పేద పద్మశాలీ కుటుంబాలకు పంపిణీ చేశారు. పోపాలో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల స్వచ్ఛంద ఆర్థిక సాయంతో మహబూబాబాద్‌ పోపా అధ్యక్షులు బుదారపు శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. తొర్రూరులోని అమ్మ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ రాజు సహకారంతో 80 మంది పేద పద్మశాలీయులకు రూ. 500 చొప్పున నగదు అందజేశారు. ఆర్డీవో ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై కిట్లు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించి ఆర్థిక సాయం చేసిన దాతలు, పోపా సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పోపా అధ్యక్షులు డాక్టర్‌ బైరి శ్రీనివాస రాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Walnoniavovan

Follow us on social media

Related posts

Leave a Comment