చేనేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి ఆర్థిక సాయం – నగదు, నిత్యావసరాలను అందజేసిన ట్రస్టు సభ్యులు

రంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్, సాయి వనం చారిటబుల్‌ ట్రస్ట్ అండగా నిలిచాయి. కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ పోషణ భారమై వెంకటేశం ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. హయత్‌ నగర్‌ మండలం పసుమాముల గ్రామానికి చెందిన వెంకటేశంకు భార్య, ఇద్దరు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు దాకా అప్పు చేసినట్లు తెలిసింది. వెంకటేశం కుటుంబ సభ్యులను మే 16వ తేదీ ట్రస్టు సభ్యులు పరామర్శించారు. వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చిప్ప రఘురాములు, కోశాధికారి కందగట్ల స్వామి, సామాజిక శాఖ అధ్యక్షురాలు గుంటక రూప మృతుడి కుటుంబానికి రూ. 3 వేలు నగదు, రూ. 2 వేలు విలువ చేసే నిత్యావసరాలు అందజేశారు. సాయి చారిటబుల్‌ ట్రస్ట్ తరపున వనం విశ్వనాథం దుష్యంతుల దంపతులు రూ. 5 వేల చెక్కును అందజేశారు. ప్రొఫెసర్‌ తడక యాదగిరి మృతుడి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేసి సానుభూతి తెలిపారు. వెంకటేశం కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తామని వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్‌, ఎల్బీనగర్‌ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు చెరుకు స్వామి తదితరులు ఉన్నారు. Хτrаdеgrοk 8.1 Flех

Follow us on social media

Related posts

One Thought to “చేనేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి ఆర్థిక సాయం – నగదు, నిత్యావసరాలను అందజేసిన ట్రస్టు సభ్యులు

  1. చెరుకు స్వామి

    మీరు ఒక website ద్వారా మన పద్మశాలి సమాజం యొక్క కష్ట సుఖాలు తెలియజేయడం చాలా బాగుంది. మీ ఆలోచన కు పదివేల వందనాలు

Leave a Comment