బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన

కర్నూలు  నగరంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుట్టా ఫౌండేషన్‌ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉస్మానియా కళాశాల ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఎం బాషా అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కులకు బట్టి సమాధానం రాయాలన్నారు.  తక్కువ మార్కుల ప్రశ్నలకు క్లుప్తంగా, ఎక్కువ మార్కుల ప్రశ్నలకు ఎక్కువ నిడిమితో సమాధానాలు  రాయాల్సి ఉంటుందన్నారు. నోట్స్‌ ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలో వివరించారు. కేవీఆర్‌ కళాశాల ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ ఫరీదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. ఏకాగ్రతతో చదివి మంచి గ్రేడ్‌లో ఉత్తీర్ణులు  కావాలని సూచించారు. పాజిటివ్‌గా ఆలోచించాలన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదన్నారు. అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అనూరాధ మాట్లాడుతూ ఏకాగ్రతతో చదివి పరీక్షలు  బాగా రాసి లక్ష్యసాధనకు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ చెస్‌ శిక్షకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏ పరీక్షక్షైనా ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో కేవీఅర్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయ భారతి, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శైలజ, సుబ్బలక్ష్మి, ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ , కో ఆర్డినేటర్లు చరిత, హేమత పాల్గొన్నారు. Dyb Rentetria

Follow us on social media

Related posts

Leave a Comment