ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ (రిజిస్ట్రేషన్ నంబర్ 609/18 ) పొలిట్ బ్యూరో ప్రతినిధుల సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురిలో మార్చి 15వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 13 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది. త్వరలో మంగళగిరిలో నిర్వహించే రాష్ట్రకార్యవర్గ సమావేశానికి చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
చేనేత కులాల డిమాండ్లపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రతినిధులంతా హాజరై తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని నాయకత్వం సూచించింది. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ముందుగా తమ పేర్లను వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు, పొలిట్ బ్యూరో ప్రతినిధి పుచ్చ రామకృష్ణకు తెలపాలని ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యవర్గం తరపున రాష్ట్ర అధికార ప్రతినిధి కేకే సంజీవ రావు (9246657227) విజ్ఞప్తి చేశారు. Værdiborg
మార్చి 15న విజయవాడలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పొలిట్ బ్యూరో ప్రతినిధుల సమావేశం
