
దసరా శరన్నవరాత్రోత్సవాలు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. కర్నూలు నగరం కుమ్మరి వీధిలోని భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయంలో రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయ కమిటీ సభ్యులు పద్మశాలీయుల ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికలను అందజేశారు. శరన్నవరాత్రోత్సవాలలో ప్రతిరోజు నిర్వహించే కుంకుమార్చనలో భక్తులు పాల్గొనవచ్చు. 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయం నుంచి స్వామివారి రథోత్సవం ఉంటుంది. పూజలో పాల్గొనే భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం పంపిణీ చేస్తారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలని భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ కమిటీ, పద్మశాలి సంఘం మార్కండేయ స్వామి సేవా ట్రస్ట్, పద్మశాలి ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, పద్మశాలి యువజన విభాగం, పద్మశాలి మహిళా విభాగం సంయుక్తంగా కోరుతున్నాయి.
