కర్నూలు జిల్లా కుర్ణి సంక్షేమ సంఘం కార్యవర్గ /పాలక వర్గ సభ్యుల సమావేశం కర్నూలు నగరం కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో అక్టోబర్ 13వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య జరుగుతుంది. నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన, వనభోజనం ఏర్పాట్లు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సభ్యులు చర్చిస్తారు. కార్యవర్గ సభ్యులంతా హాజరై సంఘం అభివృద్ధికి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కార్యవర్గం కోరుతుంది.
