శ్రీకాకుళం జిల్లాలో దేవాంగుల కుటుంబాలకు కిట్ల పంపిణీ

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు, లావేరు మండలాల పరిధిలోని తండ్యాంమెట్ట, జాడపేట, దేవరవలస, కుంకాం గ్రామాల్లోని సుమారు 50 నిరుపేద దేవాంగ కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు అందజేశారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు నక్కిన చిన వెంకటరాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉట్ల మోహనదాస్‌ గాంధీ, హైదరాబాద్‌లోని మేడ్చల్‌ శ్రీ ఉమామహేశ్వర దేవాంగ సంఘం ఆర్థిక సాయంతో సుమారు రూ. 500 విలువ గల నిత్యావసరాల కిట్లు (బియ్యం, కందిపప్పు, బొంబాయి రవ్వ, గోధుమపిండి, వంటనూనె, దినుసులు, కారం, పసుపు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక సాయం చేసిన దాతలు, విజయవంతం చేసిన పొందూరు కాశీ విశ్వేశ్వర దేవాంగ సంఘం ప్రతినిధులు తూతిక పాపారావు, తూతిక శ్రీనివాసరావు, కాలెపు వెంకటరావు, బనిశెట్టి సూర్యనారాయణ, కొడమటి మురళి, పుచ్చల మురళి, తూట అప్పల రాజు, కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన పొందూరు దేవాంగ సంఘం అధ్యక్షులు గోరు అప్పలసూరి, కన్వీనర్‌ మొగదాల రమణారావు, కార్యవర్గ సభ్యులందరికి ఆంధప్రదేశ్‌ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం జాయింట్‌ సెక్రటరీ కర్రా రవి,
హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. Хτrаdеgrοk 8.1 Flех

చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి.

Follow us on social media

Related posts

Leave a Comment