తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అంబానగర్, అంబర్ నగర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద పద్మశాలీ కుటుంబాలకు మే 31వ తేదీ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ అండగా నిలిచారు. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 100 పేద పద్మశాలీ కుటుంబాలకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చిప్ప రఘురాములు, కోశాధికారి కందగట్ల స్వామి, సామాజిక విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో నూనె, కారం, సబ్బులు, ఫేస్ మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ చేనేత కళాకారులు, పద్మశాలీ కుటుంబాలకు తమ సహకారం ఎప్పటికి ఉంటుందన్నారు. కుల బంధువులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘ మహిళ విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, న్యాయ విభాగం అధ్యక్షులు వనం విశ్వనాథం, యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్, అఖిల భారత పద్మశాలీ సంఘం కార్యదర్శి కొక్కుల దేవేందర్, సికింద్రాబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు చిక్క దేవదాస్, వారాసిగూడా పద్మశాలీ సంఘ సలహాదారు బొమ్మ నరేందర్, చిక్క నర్సింహ, కృష్ణమూర్తి, చింతకింది జానయ్య, స్వర్గం బాబురావు, స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు. Immediate Edge



