నల్గొండ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా రాపోలు పరమేష్‌

నల్గొండ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా రాపోలు పరమేష్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం నల్లగొండ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక జరిగింది.
జిల్లా గౌరవాధ్యక్షులుగా ఓలి సమీర్‌ కుమార్‌, అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా కర్నె ఆనందకుమార్‌, కోశాధికా రిగా వాడపల్లి సాయిబాబా, ఉపాధ్యక్షులుగా బరిగెల సుదర్శన్‌, కొండశంకర్‌ గౌడ్‌, కార్యదర్శులుగా అమరోజు సైదులు, ధర్మపురి విజయచందర్‌, ముఖ్య సలహాదారులుగా నేలపట్ల సత్యనారా యణ, నల్లసోమమల్లయ్య, కేశబోయిన శంకర్‌ముదిరాజ్‌లు ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ సభ్యులతో సంఘం అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

తిరుమలగిరి మండలం అల్వాల ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పరమేష్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో బీసీ ఉపాధ్యాయ సంఘం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానూ
రాపోలు పరమేష్‌ పనిచేశారు.

పద్మశాలీ కుటుంబాలకు అండగా..

మిర్యాలగూడ నంది పహాడ్‌కు చెందిన విస్తారకుల దుకాణంలో గుమస్తాగా పనిచేసే మాదాల సురేష్‌ పద్మశాలి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో బీసీ ఉద్యోగు బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ. 20 వేలను ఆర్థిక సాయం చేశారు. Best online casino Canada real money

Follow us on social media

Related posts

Leave a Comment