దాతృత్వం – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, వారి కుటుంబసభ్యులకు అన్నదానం

కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కర్నూలు వాల్‌మార్టు బజార్‌ వెనక అన్వర్‌ ప్లాజాలోని మంత్రాలయం గురు రాఘవేంద్ర (ఎంజీఆర్‌) బాయ్స్ హాస్టల్‌, కర్నూలు సి క్యాంపులోని రమా ప్రింటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని నిరుపేదలు, వలస కూలీలు, యాచకులు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, వారి కుటుంబ సభ్యులకు భోజనం వడ్డిస్తున్నారు. ఈ కార్యక్రమం మార్చి 19వ తేదీ నుంచి మొదలుపెట్టారు. ‘మొదటి రోజు షిరిడీసాయి ఆలయం, పాతబస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, కొత్తబస్టాండ్‌, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌లోని లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వివిధ వృద్ధాశ్రమాలకు వెళ్లి దాదాపు 600 మందికి భోజనం వడ్డించాం. మా సేవ కార్యక్రమాన్ని చూసిన కొంతమంది దాతలు ఆర్థిక సాయం చేస్తున్నారు. కొంతమంది నిత్యావసరాలను సమకూరుస్తున్నారు. రోజూ అన్నం, సాంబారు, పెరుగన్నం తయారుచేయించి వాహనంలో తీసుకెళ్తున్నాం. నీళ్ల ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం. కొంతమంది దాతలు మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించడంతో వాటిని కూడా పంచుతున్నాం. ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ ఎత్తివేసేదాకా కొనసాగిస్తాం’ అని హాస్టల్‌ నిర్వాహకులు చిలుక రాఘవేంద్ర, రమా ప్రింటర్‌ నిర్వాహకులు చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో పులిపాటి వెంకటేశ్వర్లు, సి. శివకుమార్‌ పాల్గొన్నారు.
దాతలు వివరాలు:
శ్రీనువాసులు, డాక్యుమెంట్‌ రైటర్‌ – 75 కేజీల బియ్యం, 35 కేజీల కందిపప్పు
ఎన్‌. నాగేశ్వరరావు -50 కేజీల బియ్యం, 10 కేజీల కందిపప్పు
ఎ. శివకుమార్‌, వెంకటరమణ కాలనీ – 50 కేజీల బియ్యం
ఎన్‌. కేశవయ్య – 25 కేజీల బియ్యం
పులిపాటి వెంకటేశ్వర్లు, ఎల్‌ఐసీ కార్యాలయం దగ్గర – 20 కేజీల బియ్యం
హెచ్‌ఎంఆర్‌సీ రెడ్డి – వంటతయారీకి సిలిండర్ల కోసం రూ. 2500/-
డి. ఆంజనేయులు గౌడ్‌, మారుతీ నగర్‌ – రూ. 2,300/-
కె. రాజ, వెంకటరమణ కాలనీ – రూ. 1000/-
కె. రామకృష్ణ, వెంకటరమణ కాలనీ – రూ. 1000/-
ఆర్‌సీ రెడ్డి ఫ్రెండ్స్ – రూ. 1000/-

 

చేనేత కులస్థులు (పద్మశాలీ, కుర్ణిశాలి, తొగటవీర క్షత్రియ, దేవాంగులు) చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలు, ఫొటోలను సెల్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. చేనేతమిత్ర వెబ్‌సైట్‌లో వీక్షించండి. Ziskovum

Follow us on social media

Related posts

Leave a Comment