ఆంధప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుడు ఓం శేఖర్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులను కులసంఘాల నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం చేస్తున్నారు. మే 22వ తేదీన ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాయలసీమ జోన్ అధ్యక్షులు డీకే నాగరాజు ధర్మవరం వచ్చారు. ఓం శేఖర్ కుటుంబానికి రూ. 50 వేలు అందజేయాలని ధర్మవరం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముక్తాపురం అజయ్ కుమార్కు నగదు అందజేశారు. ఆర్థిక సాయం చేసిన డీకే నాగరాజుకు ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య ధన్యవాదాలు తెలిపారు. డీకే నాగరాజును కలిసిన వారిలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ, ఉరవకొండ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెంగల శేఖర్, రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రకాష్, కార్యవర్గ సభ్యులు ఉట్టి అంజనేయలు, గోరు శ్రీనివాసులు, జల్లా కార్తీక్, తదితరులు ఉన్నారు. アクシス フラクスラド

