వృద్ధాశ్రమానికి బుట్టా ఫౌండేషన్‌ చేయూత

కర్నూలు నగర శివారులోని మదర్‌ థెరిస్సా వృద్ధాశ్రమానికి బుట్టా ఫౌండేషన్‌ మే 18వ తేదీ నిత్యావసర సరుకులు, నగదు అందజేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతుండడంతో కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సూచన మేరకు దాతల సహకారం, ఫౌండేషన్‌ తరుపున వృద్ధాశ్రమానికి బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు అందజేశామని, అలాగే గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలుకు నగదు ఇచ్చామని ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఆదుకున్న మాజీ ఎంపీకి ఆశ్రమ నిర్వాహకురాలు నిర్మల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు చెన్నప్ప, మోహన్‌ కృష్ణ పాల్గొన్నారు. Immediate Edge

Follow us on social media

Related posts

Leave a Comment