ప్రగడ కోటయ్య జయంతిని ఘంటసాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు అందే జగదీష్ కోటయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటయ్య ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. చేనేత వర్గాలంతా ఐక్యంగా ఉండి చేనేత సమాజానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో చేనేత నాయకులు గుత్తికొండ సత్యనారాయణ, నందం లక్ష్మీకాంతారావు, వెనిగళ్ళ శ్రీనివాస రావు పాల్గొన్నారు. Ascenso Finviora

