రూ. 22లక్షలతో ‘సింగరి’ పేరిట బంగారు పతకాలు – ఏటా వైద్య విద్యార్థులకు ప్రదానం: ఎంపీ డాక్టర్‌ సంజీవ కుమార్‌

రూ. 22లక్షలతో ‘సింగరి’ పేరిట బంగారు పతకాలు
ఏటా వైద్య విద్యార్థులకు ప్రదానం: కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ కుమార్‌

కర్నూలు వైద్య కళాశాల నుంచి తమ కుటుంబంలో 22 మంది వైద్యులమయ్యామని, ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 22లక్షలతో ఏటా చదువులో ప్రతిభ కనపరిచిన వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు ఇస్తానని కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ సింగరి సంజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. కర్నూలు వైద్య కళాశాల అభివృద్ధి కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు  ఇస్తానన్నారు. గురువారం ఆయన కర్నూలు వైద్య కళాశాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం, ఓల్డ్‌ స్టూడెంట్స్‌ వెబ్సైటును ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కర్నూలులో రాయలసీమ మెడికల్‌ సైన్సెస్‌ ఇన్సిస్టిట్టూట్‌ (రిమ్స్‌), ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. స్టేట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామ్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. Kuu Arvostus

Follow us on social media

Related posts

Leave a Comment