కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తికి మూడు మాస్కులను ఉచితంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో చేనేత, జౌళిశాఖ కర్నూలు సహాయ సంచాలకులు జి. వెంకటేశ్వర్లు మాస్కుల తయారీకి వస్త్రాన్ని వితరణ చేసేందుకు దాతలు సహకరించాలని కోరారు. అందుకు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక వెంటనే స్పందించారు. తమ వంతు సాయంగా బుట్టా ఫౌండేషన్ ద్వారా రూ. 50 వేలు విలువచేసే 1000 మీటర్ల వస్త్రాన్ని కర్నూలు జౌళిశాఖ కార్యాలయానికి పంపారు. కుర్ణి సంక్షేమ సంఘం కర్నూలు నగర అధ్యక్షులు గడిగె ప్రసాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కలిసి 200 మీటర్ల వస్త్రాన్ని సమకూర్చారు.
చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Ampla Tesouròs

