బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మెళకువలు

బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కర్నూలు నగరం బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులకు గణితంలో మెళకువలు నేర్పారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక చొరవతో ఎన్నో ప్రజా ప్రయోజక కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి పరితపించే వారిలో బుట్టా రేణుక ముందుంటారని తెలిపారు. గణితంతో పాటు ఇతర సామాజిక అంశంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్లు శైలజ, పద్మ, కేడీసీసీ రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగరాజు, సమన్వయకర్త చరిత పాల్గొన్నారు. Høyde Dexnex

Follow us on social media

Related posts

Leave a Comment