చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నాంపల్లి చేనేత సంఘం నాయకులు, సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో చేనేత కార్మికులు గత కొన్ని రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొని, ప్రతి చేనేత కుటుంబానికి జీవన భృతిగా నెలకు రూ. 6వేల చొప్పున చెల్లించాలని కోరారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న, మృతిచెందిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఆదుకుని వారి పిల్లలకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రతి చేనేత కార్మికుడికి రూ. 10 లక్షల జీవిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి చేనేత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులకు యూనిఫాంల తయారీలో చేనేత వస్త్రాలను వినియోగించాలని నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుర్రం శ్రీరాములు, భర్తయ్య, భిక్షమయ్య, వెంకటేశ్వర్లు, గణేష్, భావనారుషి, గోలి కృష్ణ, పిల్లలమర్రి రంగయ్య, సంఘపు గణేష్, లక్ష్మయ్య, కర్నాటి విజయ్, రుద్ర వెంకన్న, అవ్వారి భాస్కర్, ఆలే శేఖర్, గుర్రం వెంకయ్య, నక్క భువనేశ్వర్, సంగేపు లక్ష్మన్ పాల్గొన్నారు. Ren Sparevoll


