కర్నూలు జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం సమావేశం అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5గంటలకు కర్నూలు నగరం కల్లూరులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో జరిగింది. సంఘం సభ్యులు మూడు అంశాలపై చర్చించారు. సంఘానికి శాశ్వత కార్యాలయ ఏర్పాటు, చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం, కార్తీకమాస వన భోజనాలు, 2020 సంవత్సరం క్యాలెండర్ ముద్రణపై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశంలో సంఘం ప్రధానకార్యదర్శి గుంపు వెంకటేశ్వర్లు, కోశాధికారి మాదం కొండయ్య, సభ్యులు పాల్గొన్నారు.
నవంబర్ 10న జ్యోతి ఉత్సవాలు
”అయ్యప్ప స్వామి దేవాలయంలో వెలసిన చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతి ఉత్సవాల గురించి నభ్యులతో చర్చించాం. నవంబర్ 10వ తేదీన పాత అయ్యప్ప స్వామి ఆలయం నుంచి కొత్త అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించాలనుకున్నాం. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకున్నాం. కొత్త కమిటీ ఏర్పడ్డాక సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు గ్రామాల్లో, మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం. ప్రతి ఏటా వనభోజనాలకు చేనేత కులాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం. ఈ సారి తోగటవీర క్షత్రీయ సంఘం రాష్ట్ర నాయకులు, జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానించదలిచాం. వనభోజన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కార్తీక మాసంలో బైక్ ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. వీటిపై మరోసారి సభ్యులతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటాం”
– అక్కెం నరహరి దాస్, అధ్యక్షులు, కర్నూలు జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం. Leztruvin
