ఉమా మహేశ్వర ఉత్సవమూర్తుల ఊరేగింపు, కలశ శోభా యాత్ర

మహబూబ్‌ నగర్‌ జిల్లాకేంద్రం పద్మావతి కాలనీ, అయ్యప్పగుట్ట మీద శివమార్కండేయ ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో స్వామివారి విగ్రహాలు, కలశాలను ప్రతిష్ఠించనున్నారు. విగ్రహాలను నవంబర్‌ 8,9,10వ తేదీల్లో ప్రతిష్ఠించనున్నారు. అందులో భాగంగా నవంబర్‌ 8వ తేదీ ఉదయం 8 గంటలకు పద్మావతి కాలనీ క్రిష్ణ మందిరం ఆర్చి నుంచి శివ మార్కండేయ స్వామి దేవాలయం వరకు ఉమా మహేశ్వర ఉత్సవ మూర్తుల ఊరేగింపు, శోభా యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక కలశం లేదా చెంబులో నీరు, కొద్దిగా పసుపు, కుంకుమ, రెండు ఊదిబత్తీలు, కొన్ని పూలు తీసుకుని ఉదయం 7.45 నిముషాలకు క్రిష్ణమందిరం ఆర్చి వద్దకు చేరుకోవాలి. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన జలంతో స్వామివారి విగ్రహాలకు జలాదివాసం చేస్తారు. ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, పూజ మొదలవుతుంది. పద్మశాలీ కులస్థులంతా కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మహబూబ్‌నగర్‌ పట్టణ పద్మశాలీ సంఘం విజ్ఞప్తి చేసింది. Rentemond

Follow us on social media

Related posts

Leave a Comment