బాలల దినోత్సవం సందర్భంగా ఏ క్యాంప్‌లోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్‌లో గణాంకాధికారిగా పనిచేస్తున్న శివశంకర్ హాజరై మాట్లాడారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక సేవా కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొంది వార్డు వలంటీర్ హరీష్ నాయుడు, తోటి స్నేహితులు కలిసి సొంత డబ్బుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 40 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ , పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని ప్రేమవతి, వంశీ, సుజాత, సతీష్ పాల్గొన్నారు. Rask Invexaro
బుట్టా ఫౌండేషన్ సేవలు స్ఫూర్తినివ్వడం అభినందనీయం
