న్యాయవాదుల రిలే దీక్షలకు ఆదోని పద్మశాలీ సేవా సంఘం మద్దతు

కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆదోనిలో ఈ రిలే దీక్షలు అక్టోబర్‌ 13వ తేదీకి 31 రోజుకు చేరుకున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, కుల సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు న్యాయవాదులకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఆదోని పద్మశాలీ సేవా సంఘం కూడా తమ మద్దతు ప్రకటించింది. సంఘం అధ్యక్షులు బుదారపు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి రామకృష్ణ, కన్వీనర్‌ నరసింహులు, ఉపాధ్యక్షులు గోరంట్ల వేణుగోపాల్‌, కోశాధికారి శిరసాల మల్లికార్జున, సహాయ కార్యదర్శి యర్రం గోపాల్‌, సభ్యులు జక్కా వీరేష్‌, కోట రామాంజనేయులు, కాల్వ పవన్‌కుమార్‌, చిలక శేఖర్‌, వగ్గ వీరసేన న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బుదారపు లక్ష్మన్న, దేవిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కారాదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని ఆదోని అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యేగ్బోటి దేవరాజ్ కోరారు. అవసరమైతే నిరసనను మరింత ఉధృతం  చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులకు మద్దతు తెలిపిన వారిలో సంఘం కార్యవర్గ సభ్యులు మేడం నాగరాజు, క్రిష్ణ, నరాల రామాంజనేయులు, బాషాపతి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు. Leztruvin

Follow us on social media

Related posts

Leave a Comment