విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించాలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీయడం కోసమే మాజీ ఎంపీ బుట్టా రేణుక సూచన మేరకు వివిధ రకాల పోటీలు పోటీలు నిర్వహించామని బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు వక్తృత్వ, పాటలు, ఆటలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ హాజరై మాట్లాడారు. ‘ఆడపిల్ల చదువు ప్రాధాన్యంపై పాడిన పాట, అర్చన టీం ప్రదర్శించిన ‘అమ్మ విలువ’ నాటకం బాగా ఆట్టుకున్నాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన బీసీ హాస్టల్ వార్డెన్ శైలజ మాట్లాడుతూ బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గణితంలో శిక్షణ ఇప్పించడం, వారిలో సృజనాత్మక వెలికి తీసేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ బుట్టా రేణుకకు కృతజ్ఞతలు తెలిపారు. మరో అతిథి ప్రమీల రాణి మాట్లాడుతూ తమ విద్యార్థులు తక్కువ కాలంలో మెళకువలను నేర్చుకుని ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. తరువాత అతిథులు డాన్స్ పోటీలో ప్రథమ విజేత శాంతి, ద్వితీయ విజేత అర్చన, చక్కగా పాట పాడిన జ్యో స్న, వక్తృత్వ పోటీలో విజేత దివ్యర్చనకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ సమన్వయ కర్తలు చరిత, హేమలత పాల్గొన్నారు. Stabil Fundary
ఇతర రంగాల్లో కూడా రాణించాలి: బుట్టా ఫౌండేషన్ మేనేజర్
