తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 17వ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల అధినేతలు, ముఖ్యనాయకులు తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు వారికి దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలీయులను కూడా ఎన్నికల బరిలో నిలిపే యోచనలో సంఘం నాయకులు ఉన్నారు.
పోటీ చేసే పద్మశాలీ అభ్యర్థులకు తాను స్వయంగా నామినేషన్‌కు అయ్యే ఖర్చు భరిస్తానని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబూ రావు తెలిపారు. పద్మశాలీయులు కూడా రాజకీయంగా ఎదగాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంఘం తరుపున పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
సభ్యత్వ నమోదు
తెలంగాణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు పక్రియ చురుకుగా సాగుతోంది. పలు డివిజన్లలో సంఘం నాయకులు పద్మశాలీయుల ఇళ్లకు వెళ్లి సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్..
నవంబర్ 18న నామినేషన్ల ప్రారంభం, 20వతేది నామినేషన్లకు చివరి రోజు. 21న పరిశీలన, 24న ఉపసంహరణ, డిసెంబర్ 1న పోలింగ్, 3న అవసరమైతే రీపోలింగ్, 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Zlatá Era