పద్మశాలీయుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తానని కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఆయనను ఇటీవల వెంకటగిరిలోని తన గృహంలో పద్మశాలీయులు ఘనంగా సత్కరించారు. వెంకటేశ్వరరావు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి. వైసీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షులు కూడా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాల అభ్యున్నతి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తనను డైరెక్టర్‌గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రికి, ఉమ్మడి ఏపీలో మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నమ్మకంతో అప్పగించిన ఈ పదవికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పద్మశాలీయుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. వెంకటేశ్వర రావును కలిసిన వారిలో పద్మశాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాడా జానకిరామయ్య, ఆంధప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. రమాకాంత్, వేముల వెంకటేశ్వర్లు, కాంతారావు, కసరు రామయ్య, చింతగింజల సుబ్రహ్మణ్యం, గాజుల సుబ్రహ్మణ్యం, మురళి, వెంకటసుబ్బయ్య, మాడ ముని రామయ్య, ప్రసాద్. మాస్టర్ వీవర్స్, వీవర్స్ ఉన్నారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika

