

లాక్‌డౌన్ సమయంలో చేనేత సమాజానికి చెందిన పలువురు రంగస్థల కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రదర్శనలు లేక 8 మాసాల పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరికి పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీవా) అండగా నిలిచింది. కాకినాడకు చెందిన వస్త్ర వ్యాపారవేత్త వింజమూరి భాస్కరరావు, వారి కుటుంబసభ్యుల సౌజన్యంతో అక్టోబర్ 23వ తేదీ తెనాలి ఉప్పు బజారులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 25మంది కళాకారులకు నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ పీవాలో ఎక్కువ మంది సభ్యులను చేర్చి బలోపేతం చేయడం వల్ల మూలధనం పెరిగి మరికొంతమందికి సేవచేసే అవకాశం కలుగుతుందన్నారు. కళాకారుల ట్రూప్ ఆర్గనైజర్ దీపాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 8 నెలలుగా నాటకాలు లేక కుటుంబాలు గడవడం కష్టమైన పరిస్థితిల్లో తమను ఆదుకున్న పీవా సభ్యులు, వింజమూరి భాస్కరరావు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీవా కేంద్ర కమిటీ సభ్యులు, గుంటూరు శాఖ కార్యదర్శి గుర్రం చినవీరయ్య, కేంద్ర కమిటీ సభ్యులు భట్టిప్రోలు శాఖ కార్యదర్శి సాంబశివరావు, తెనాలి శాఖ అధ్యక్షులు, కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, టి.పాపారావు పాల్గొన్నారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika
