న్యాయవాదుల దీక్షలు ఫలించాయి: మాజీ ఎంపీ బుట్టా రేణుక

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఫలించాయని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. వికేంద్రీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు మొగ్గు చూపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్‌ 20వ తేదీకి న్యాయవాదుల దీక్షలు వంద రోజులకు చేరుకోవడం, అదే సమయంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై జీఎన్‌ రావ్‌ కమిటీ అనుకూలంగా నివేదిక ఇవ్వడంపై జిల్లా బార్‌ అసోసియేషన్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బుట్టా రేణక పాల్గొన్నారు. మాజీ ఎంపీతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌ రెడ్డి , ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. Dyb Rentetria

Follow us on social media

Related posts

Leave a Comment