గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థినులకు తెలిసి ఉండాలని దంత వైద్యురాలు డాక్టర్ లిఖిత రెడ్డి పేర్కొన్నారు. బుట్టా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఎస్‌సీ, బీసీ బాలికల హాస్టల్‌లో నాలుగు నుంచి పది వరకు చదువుతున్న విద్యార్థినులకు నవంబర్ 29వ తేదీన గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ఆమె అవగాహన కల్పించారు. తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే కుటుంబసభ్యులకు లేదా ఉపాధ్యాయులకు తెలపాలని విద్యార్థినులకు సూచించారు. చిన్నారులపై ఇరుగుపొరుగు వారు, బంధువులు అఘాయిత్యానికి పాల్పడుతుండడంతో వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. కౌమార దశలో ఉన్న విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలిని, శారీరక మార్పులపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. బుట్టా ఫౌండేషన్ సమన్వయ కర్త చరిత, హేమలత మాట్లాడుతూ కుటుంబంలో ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా తల్లిదండ్రులు నైతిక విలువలు నేర్పాలన్నారు. మంచి, చెడు గురించి సందర్భం దొరికినప్పుడల్లా చెబుతుండాలన్నారు. అమ్మాయిలను గౌరవించడం , పెద్దల పట్ల వినయ విధేయతను నేర్పాలన్నారు.ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంటుందన్నారు. బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ ఆపద సమయంలో ఆడపిల్లలు 100కు కానీ 112 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రమీల రాణి పాల్గొన్నారు. చివరగా డాక్టర్ లిఖిత రెడ్డిని బుట్టా ఫౌండేషన్ సభ్యులు శాలువ కప్పి సన్మానించారు. BTC Genix V7.2
‘విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలిసి ఉండాలి’
