జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా ఊట్ల రమేష్‌ బాబు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఊట్ల రమేష్‌ బాబు ఎన్నికయ్యారు. నవంబర్‌ 16వ తేదీ కర్నూలులో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మురళీ మనోహర్‌ నియామక పత్రాన్ని రమేష్‌కు అందజేశారు.

ఊట్ల రమేష్‌ బాబు గురించి..

కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన ఊట్ల రమేష్‌ బాబు మాణిక్యమ్మ, మార్కండేయుడి దంపతులకు రెండో సంతానం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. పద్మశాలీ కులస్థులు. కర్నూలు కొత్తపేటలోని బాలశివ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చాలా సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘానికి జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు కర్నూలు నగర  పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షులుగా కొనసాగారు. అలాగే 2016 నుంచి 2019 వరకు కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున 4వ వార్డుకు ఇన్‌చార్జిగా ఉంటున్నారు.  వార్డులో 35 సంవత్సరాల క్రితం వేసిన మురుగు కాలువలు, వీధుల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాటి పునర్ణిర్మాణానికి శ్రమించారు. అమృత్‌ పథకం కింద దాదాపు 160 కుటుంబాలకు మంచి నీటి కుళాయిలు, 20 మందికి వింతతు పింఛన్లు, 42 మందికి వృద్ధాప్య పింఛన్లు, ఆరుగురికి ఒంటరి మహిళ పింఛన్లు మంజూరయ్యేలా కృషి చేశారు. అర్హులకు చంద్రన్న బీమా పథకం వర్తించేలా చూశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రమేష్‌ చూపుతున్న చొరవను చూసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆయనను యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌ రావు యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర నాయకులు శివరాం, విజయ్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్‌, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంకతి లక్ష్మీ నారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మోహన్‌, బీసీ నాయకులు, కార్యకర్తలకు రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. రమేష్‌కు అక్క ఉమామహేశ్వరి, తమ్ముడు శ్రీనివాసులు, చెల్లెలు వరలక్ష్మి ఉన్నారు. భార్య పేరు పులిపాటి సరిత, కూతురు కుందనగౌరి.

Záloha Corebit

Follow us on social media

Related posts

Leave a Comment