17న కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం

కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 17వ తేదీ (ఆదివారం) కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహిస్తున్నామని అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి నారాయణ వెంకట నారాయణ, కోశాధికారి కాంచానం బాలాజీ తెలిపారు. నందికొట్కూరుకు వెళ్లే మార్గంలో వార్త దినపత్రిక ఎదురుగా ఆదర్శ విద్యా మందిర్‌ (తిమ్మయ్య కాలేజీ) ప్రాంగణంలో నిర్వహించే ఈ మహోత్సవానికి పలువురు రాజకీయ ప్రముఖులు, కులపెద్దలు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పద్మశాలీ అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ కల్చరల్‌ అకాడమీ విద్యార్థులతో నృత్య ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. తర్వాత ఉత్తమ వస్త్రాలంకరణ పోటీ – ఎంపికయిన ఉత్తమ జంటకు ఆకర్షణీయమైన బహుమతి అందజేస్తామన్నారు. అలాగే కుర్చిలాట, తంబోలా గేమ్‌ ఉంటాయని తెలిపారు. వివాహ సంబంధాల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో వధూవరుల ఫొటోలు, వివరాలను స్వీకరిస్తామన్నారు. వనభోజన దాతల కోసం మరో కౌంటర్‌ ఉంటుందని, ఇందులో దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయం చేసి రశీదు పొందవచ్చన్నారు. వన భోజన మహోత్సవానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీ కులస్థులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. Alza Bitmarea

Follow us on social media

Related posts

Leave a Comment