మహబూబ్ నగర్ జిల్లాకేంద్రం పద్మావతి కాలనీ, అయ్యప్పగుట్ట మీద శివమార్కండేయ ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో స్వామివారి విగ్రహాలు, కలశాలను ప్రతిష్ఠించనున్నారు. విగ్రహాలను నవంబర్ 8,9,10వ తేదీల్లో ప్రతిష్ఠించనున్నారు. అందులో భాగంగా నవంబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు పద్మావతి కాలనీ క్రిష్ణ మందిరం ఆర్చి నుంచి శివ మార్కండేయ స్వామి దేవాలయం వరకు ఉమా మహేశ్వర ఉత్సవ మూర్తుల ఊరేగింపు, శోభా యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక కలశం లేదా చెంబులో నీరు, కొద్దిగా పసుపు, కుంకుమ, రెండు ఊదిబత్తీలు, కొన్ని పూలు తీసుకుని ఉదయం 7.45 నిముషాలకు క్రిష్ణమందిరం ఆర్చి వద్దకు చేరుకోవాలి. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన జలంతో స్వామివారి విగ్రహాలకు జలాదివాసం చేస్తారు. ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, పూజ మొదలవుతుంది. పద్మశాలీ కులస్థులంతా కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మహబూబ్నగర్ పట్టణ పద్మశాలీ సంఘం విజ్ఞప్తి చేసింది. Rentemond
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -

దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం
చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక...