ఎయిడెడ్‌ పాఠశాలలో కంటి వైద్య శిబిరం

బుట్టా రేణుక ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీన కర్నూలు నగరంలోని ఎస్‌ఆర్‌సీసీఈ ఎయిడెడ్‌ పాఠశాలలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కర్నూలులోని సుశీల నేత్రాలయ ఆసుపత్రి అధినేత డాక్టర్‌ సుధాకర్‌ సహకారంతో వైద్యులు విద్యార్థుల కళ్లను పరీక్షించారు. ఐదుగురు విద్యార్థినులకు కంటి అద్దాలు అవసరమని నిర్ధారించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక సహకారంతో ఆగస్టు 16వ తేదీ వారికి బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌, కో ఆర్డినేటర్లు చరిత, హేమలత కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సురేష్‌ బుట్టా ఫౌండేషన్‌ సేవలను కొనియాడారు. ఫౌండేషన్‌ ద్వారా మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రజలకు నిత్యం సేవలందిస్తుండడం అభినందనీయమని అన్నారు. రాజేష్‌ మాట్లాడుతూ మాజీ ఎంపీ మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబమంతా ఉన్నతంగా ఉంటుందని బుట్టా రేణుక చెబుతుంటారని, బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో మాజీ ఎంపీ మొదటివారని పేర్కొన్నారు. Høj Investgård

Follow us on social media

Related posts

Leave a Comment