‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ నవలకు రాష్ట్ర స్థాయి పురస్కారం

హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య  వివరాలు వెల్లడించారు. పద్య, గేయ కవిత్వంలో రాచాలపల్లి బాబు దేవిదాస శర్మ రచించిన ‘శ్రీరామాయణోపనిషత్తు’, వచన కవితలో తోట నిర్మలా రాణి అద్దం నా చిరునామా కాదు బహుమతులను గెలుచుకున్నాయి. అలాగే నవలా ప్రక్రియలో డాక్టర్ వెన్నం ఉపేందర్ రచించిన ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ గ్రంథం, సాహిత్య విమర్శలో బండారి రాజ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కవి ముద్ర’ గ్రంథం , కథ ప్రక్రియ లో డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ‘కండిషన్స్ అప్లై’ గ్రంథం పురస్కారానికి ఎంపికయ్యాయని వివరించారు.

అభినందనీయం..

‘‘గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన డాక్టర్ వెన్నం ఉపేందర్ రచించిన ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ నవలకు చోటు దక్కడం అభినందనీయం. నవలలో పొందుపరచిన భావాలు చదువరుల గుండె లోతుల్లోకి సూటిగా దూసుకువెళ్ళేలా.. పదాల కూర్పు కోసం రచయిత పడిన కష్టానికి ఈ పురస్కారం ద్వారా సముచిత గౌరవం దక్కిందని నా అభిప్రాయం. ఈ నవల మీద సమీక్ష రాసే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఒదిగి ఉండడం ఉపేందర్ లాంటి కొందరికే సాధ్యం. ఇంతటి గొప్ప రచయిత కలం నుంచి పాఠకుల మది దోచుకునే మరిన్ని రచనలు జాలువారాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’

-కోట దామోదర్
సెల్:  9391480475 True Ledgewick

Follow us on social media

Related posts