తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా

చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: చేతి వృత్తులకు చేయూత పథకంలో పద్మశాలీ కులాన్ని చేర్చాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక డిమాండ్‌ చేస్తుంది. ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సూచన మేరకు జూన్‌ 19వ తేదీ ఉదయం 10 గంటలకు కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వేదిక కరీంనగర్‌ జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్‌ హాజరవుతున్నారని పేర్కొన్నారు. పద్మశాలీ కులస్థులంతా ధర్నా కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నారు.

రూ. లక్ష సాయం వారికి మాత్రమే..

బీసీ కుల, చేతి వృత్తిదారుల వారికి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనుంది. అయితే ఈ ఆర్థిక సాయం 15 కులాలకే ఇవ్వనున్నారు. ఆ కులాల వివరాలను బీసీ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసింది. జాబితాలో 1. నాయీ బ్రాహ్మణులు 2. రజక 3. సగర / ఉప్పర 4. కుమ్మరి/శాలివాహన 5. అవుసల 6. కంసాలి 7.కమ్మరి 8. కంచరి 9. వడ్ల/వడ్ర / వడ్రంగి, శిల్పులు 10.కృష్ణ బలిజ పూసల 11. మేదర 12. వడ్డెర 13. ఆరె కటిక 14. మేర 15. ఎంబీసీలను రూ.లక్ష స్కీం వర్తించే బీసీ కులాలుగా పేర్కొన్నది. అలాగే కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1 ఏప్రిల్‌ 2021 తరువాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవవాలని ప్రభుత్వం పేర్కొంది.

చేనేతమిత్ర మాసపత్రిక 

Ascesa Finport

Follow us on social media

Related posts

Leave a Comment