ఘనంగా మహిళా చైతన్య సదస్సు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో కార్యక్రమాలు జరిగాయి. అనంతపురం జిల్లా కేంద్రం తపోవనంలోని మార్కండేయ స్వామి దేవస్థానంలో మార్చి 12వ తేదీన మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. అనంతపురం జిల్లా సంఘం అధ్యక్షులు బడిగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదరి కొంతం శివరుద్రప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో మహిళా సంఘం కార్యదర్మి గండాబత్తుల సుజాత మాట్లాడారు. పద్మశాలీ మహిళా ఉద్యోగులు కలిసికట్టుగా ఉంటూ సాధికారిత వైపు అడుగుల వేయాలని కోరారు.


సాంస్కృతిక కార్యదర్శి కోడి శ్రీదేవి మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా రాయదుర్గం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొరాళ్ల శిల్ప గారు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను అభినందిస్తూ సన్మానించారు. కార్యక్రమంలో నేత్ర హాస్పిటల్‌ వైద్యురాలు డాక్టర్‌ గాజుల దివ్యశ్రీ, న్యాయవాది మనోరమ, పేవా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు చంద్రశేఖర్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.చేనేతమిత్ర మాసపత్రిక

మాసపత్రిక కోసం మీ పూర్తి చిరునామాను సెల్‌ నంబర్‌ 8333871117కు పంపగలరు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitkra Maasapatria

Croft Tradstead

Follow us on social media

Related posts

Leave a Comment