ముగిసిన తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం – తీర్మాణాలను ఆమోదించిన సభ్యులు

తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అఖిలభారత పద్మశాలీ అన్నసత్రం యాదగిరి గుట్ట ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు (అక్టోబర్‌ 2వ తేదీ) సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు సంఘం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ సమకూరుస్తున్నామని, పద్మశాలీ ఉద్యోగుల కోసం ఈ మాగజీన్‌ విడుదల చేస్తున్నామని, పద్మశాలీ యువతీ, యువకుల పెళ్లిళ్ల కోసం ప్రతి ఆదివారం నాగోల్‌ కార్యాలయంలో వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. 2015లో వరంగల్‌లో ప్రారంభమైన పద్మశాలీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లాలలో పూర్తి స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రెండవ రోజు (అక్టోబర్‌ 3వ తేదీ) జరిగిన సమావేశంలో కార్యవర్గం కొన్ని తీర్మాణాలు చేసింది. అంతకుముందు బతుకమ్మ చీరల పంపిణీ పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆయన తనయుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


తీర్మాణాలివి..

1. రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి.
2. ఏటా ప్రతి ఉద్యోగి కనీసం రూ.5వేలకు తక్కువ కాకుండా చేనేత వస్త్రాలను ఖరీదు చేయాలి.
3. జిల్లా స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించడం.
4. జనవరి 26, ఆగస్టు 15న అవార్డులు పొందిన ఉద్యోగులకు అభినందన సభ నిర్వహించడం.
5. సంవత్సరంలో ఒకసారి జిల్లా స్థాయిలో వివాహ పరిచయ వేదిక నిర్వహించడం.
6. ప్రతి జిల్లాలో సభ్యత్వ నమోదు డిసెంబర్‌లోపు పూర్తి చేయాలి.
7. పద్మశాలీయులకు నామినేటెడ్‌ పదవులలో ప్రాధాన్యం ఇవ్వాలి.

సమావేశంలో గౌరవ అతిథి యాదగిరి గుట్ట అన్నసత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ రచ్చ శ్రీనివాస్‌, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, పెండెం శ్రీనివాస్‌,
రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శిరందాసు యాదగిరేందర్‌, బాసబత్తిని రాజేశం, ఆడెపు మల్లికార్జున్‌, కాటబత్తిని ఆంజనేయులు పట్టణ పద్మశాలి అధ్యక్షులు, పొన్న మల్లయ్య, జెట్ల భాస్కర్‌, గంజి రాంమోహన్‌, రాజమోహన్‌, రామారావు, బింగి చిరంజీవి, జెట్ల భాస్కర్‌, చిందం శ్రీనివాస్‌, గుర్రం క్రిష్ణ, చౌటిభూమేశ్వర్‌, గంజి శ్రీనివాస్‌, ఇప్పకాయల విష్ణుమూర్తి, గంజి శ్రీనివాస్‌, శివశంకర్‌, మామిడాల రవికుమార్‌, కొండబత్తుల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. Investrax 3.0

Follow us on social media

Related posts

Leave a Comment