కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని సీ క్యాంపు కార్పొరేటర్ కటారి పల్లవి పేర్కొన్నారు. మే 28వ తేదీ సీ క్యాంప్ రైతు బజార్లోని రైతుల కోసం మాస్కులు, శానిటైజర్లను బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కల్యాణికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పల్లవి హాజరై రైతులకు వాటిని పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ మాస్కులు, శ్యానిటైజర్లను పంపిణీ చేయడం హర్షనీయమని పేర్కొన్నారు.
రాజేష్ మాట్లాడుతూ కోవిడ్ రెండో దశలో వైరస్ ఎక్కువగా పల్లె ప్రాంతాలకు విస్తరించిందని, వివిధ గ్రామాల నుంచి వచ్చే రైతులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వారికి నాణ్యమైన మాస్కులు అందజేస్తున్నామని తెలిపారు. కళ్యాణి మాట్లాడుతూ బుట్టా రేణుక సామజిక బాధ్యతలో భాగంగా రైతులకు మాస్కులు, శానిటైజర్ అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి సురేష్, ప్రతాప్, ప్రశాంత్, గణప చెన్నప్ప , సాయి గౌడ్, రైతు బజార్ సిబ్బంది పాల్గొన్నారు. Snap Cormax Sys

