మంగళగిరికి చెందిన పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి, రామకృష్ణ దంపతులను మంగళగిరి పట్టణ పద్మశాలీ బహోత్తమ సంఘం నాయకులు అక్టోబర్ 29వ తేదీన కలిశారు. వారికి శాలువ కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలీయుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. డైరెక్టర్ దంపతులను కలిసిన వారిలో సంఘం అధ్యక్ష,కార్యదర్సులు చింతకింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు, కోశాధికారి గంజి రవీంద్రనాధ్, సహాయకార్యదర్శి, శివాలయం ట్రస్టుబోర్డు చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరావు, సహాయకార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు దామర్ల పెదమస్తానరావు, కార్యవర్గ సభ్యులు తిరువీదుల కిరణ్, జొన్నాదుల భిక్షారావు, త్రిమూర్తులు, రామారావు, పారేపల్లి మహేష్ తదితరులు ఉన్నారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika Bitnex Crestfort

