తెలంగాణ పద్మశాలీ ఉద్యోగులు సంఘం (టీపీయూఎస్) చేసిన విజ్ఞప్తికి భారీ స్పందన వస్తోంది. వద్మశాలీ సమాజానికి చెందిన పేద విద్యార్థుల కోసం వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్, పాఠ్య పుసక్తాలను విరాళంగా ఇవ్వాలని సంఘం గతంలో పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పలువురు పద్మశాలీ ఉద్యోగులు స్పందించారు. రైల్వే లోకో పైలెట్ పొబ్బతి శ్రీనివాస్ (కాజీపేట), టీపీయూఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు మార్గం ధర్మదేవ్, వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నూతి సుధాకర్ (హైదరాబాద్) వారి వద్ద ఉన్న విలువైన పుస్తకాలను అక్టోబర్ 18వ తేదీ అందచేశారు. వీటిని వరంగల్ హంటర్ రోడ్‌లోని బీసీ నేత హాస్టల్ లైబ్రరీలో ఉంచుతున్నామని సంఘం నాయకులు తెలిపారు. అవసరమున్న పద్మశాలీ పేద విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. పుస్తకాలను విరాళంగా ఇచ్చే వారు సంఘం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి మెండు మృత్యుంజయ (9948060101)కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


‘పాత పుస్తకాల సేకరణ, పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. నిజంగా ఇది శుభపరిణామం. సంతోషదాయకం కూడా. పేద విద్యార్థులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన దాతలకు నా కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరికొంతమంది విద్యార్థులకు సాయపడాలని కోరుతున్నా’ అని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.


