తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం (టీపీయుఎస్) మరో సేవా కార్యక్రమానికి పూనుకుంది. పద్మశాలీ సమాజానికి చెందిన వ్యక్తులు, యువకులు, ఉద్యోగుల నుంచి పుస్తకాలు, స్టడీ మెటీరియల్ సేకరిస్తున్నారు. ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పలు రకాల పుస్తకాలను సేకరించి వాటిని వరంగల్ హంటర్ రోడ్‌లోని బీసీ నేత హాస్టల్ లైబ్రరీలో భద్రపరుస్తారు. ఫలితంగా వాటిని పేద పద్మశాలీ విద్యార్థులు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎంతో విజ్ఞానాన్ని పంచే పుస్తకాలను కేవలం అల్మారాకు పరిమితం చేయకుండా మరికొంతమంది విద్యార్థులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 11వ తేదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీయుఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరందాస్ యాదగిరేందేర్ తన జన్మదిన సందర్భంగా విలువైన పుస్తకాలను అందచేశారు. ఆయనకు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. పుస్తకాలను విరాళంగా ఇచ్చే వారు సంఘం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి మెండు మృత్యుంజయ (9948060101)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మార్గం ధర్మదేవ్, ప్రధాన కార్యదర్శి ఆదేపు మల్లికార్జున్, కోశాధికారి కొండాబత్తుల రాజమౌళి, సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp: 83338 71117
email : chenetamitra@gmail.com
facebook: Chenetamitra Maasapatrika Evitraps

