కర్నూలు నగరం 4 వవార్డులో కూరగాయల కిట్ల పంపణీ

లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో కర్నూలు నగరం 4వ వార్డులో కూరగాయల కిట్ల పంపిణీకి ముందుకు వచ్చారు ఆ వార్డు టీడీపీ ఇన్‌చార్జి ఊట్ల రమేష్‌ బాబు. భవన నిర్మాణ రంగంలో అపార అనుభవం ఉండి, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెంచర్లు వేసిన రోహిణి ఇన్‌ఫ్రా అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత కొంకతి లక్ష్మీనారాయణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రూ. 100 విలువచేసే ఒక్కో కూరగాయల కిట్‌ను 750 కుటుంబాలకు దంపతులు ఊట్ల రమేష్‌, పులిపాటి సరిత మే 2వ తేదీన అందజేశారు. వార్డు ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కుల ధరించి కిట్లను అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే ఊట్ల రమేష్‌ బాబు గతంలోనూ యువ పారిశ్రామిక వేత్త టీజీ భరత్‌ సహకారంతో వార్డువాసులకు హైపో ద్రావణం పంపిణీ చేశారు. అలాగే 3,4,5,7 వార్డుల పారిశుధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. కిట్ల పంపిణీ కార్యక్రమంలో మెటికల వెంకటరమణ, బోడ లక్ష్మీనరసయ్య, ఎం తులసీ, నాగేశ్వరమ్మ, రాఘవేంద్ర, డి నాగేంద్ర, ఎం హరి, జుబేర్‌, ఏజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

చేనేత  కుల సంఘాల  కార్యవర్గ ,సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాల వివరాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి Fundex Bitport

Follow us on social media

Related posts

Leave a Comment