భౌతిక దూరం పాటించడమే కరోనాకు మందు : తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ – వొగ్గు బాలరాజు ఆధ్వర్యంలో పేద పద్మశాలీ కులస్థులకు నిత్యావసరాల కిట్ల పంపిణీ

భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్‌ను నియంత్రించగలమని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఫేస్‌ మాస్కులు ధరించడం, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా వైరస్‌ దరిచేరదని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజు జిల్లా కేంద్రంలోని పేద పద్మశాలీ కులస్థులకు నిత్యావసరాలను కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 26వ తేదీన అశోక్‌ టాకీసు సమీపంలోని మార్కండేయ స్వామి ఆలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరై కిట్లను అందజేశారు. పద్మశాలీ కులస్థులు ఉదయం 7 గంటలకే ఆలయానికి చేరుకున్నారు. భౌతిక దూరం పాటించాలని కోరుతూ వారికి పద్మశాలీ సంఘం నాయకులు మాస్కులు అందజేసి ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారికి బిస్కెట్లు, అరటి పండ్లు, మంచినీళ్లు అందజేశారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని సమాచారం అందడంతో ఆయన వచ్చేవరకు వేచి ఉన్నారు. మధ్యా హ్నం 1.30 గంటలకు మంత్రి కిట్ల పంపిణీ ప్రారంభించారు. దాదాపు 200 మంది పేద పద్మశాలీయులకు కిట్లు అందజేశారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి అండగా నిలిచిన కార్యవర్గానికి, సహకరించిన యువజన సంఘం నాయకులు, విరాళాలు ఇచ్చిన దాతలకు బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఎమ్మార్వో మాచ ప్రభాకర్‌ రావు, సావనీర్‌ మల్టీ రియల్‌ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ అధినేత డా. కోదండపాణి, మహబూబ్‌నగర్‌ పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షులు అప్పం అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందజేత..
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వానికి పలువురు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా
మహబూబ్‌ నగర్‌ ప్రజల కోసం తన వంతు సాయంగా మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట రూ. 10 వేల చెక్కును వొగ్గు బాలరాజు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు అందజేశారు.

చేనేత కులస్థుల కార్యవర్గ సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్‌ నెంబర్  83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి. Alza Bitmarea

Follow us on social media

Related posts

Leave a Comment