కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు (సెప్టెంబర్ 25వ తేదీ) అమ్మవారు కాత్యాయినీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.


నవరాత్రోత్సవాల్లో చండీ హోమం కూడా నిర్వహించడం విశేషం. నాలుగో రోజు (25వ తేదీ) భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు యర్ననాగు శేషయ్య – గౌరమ్మ దంపతులు, వస్త్ర వ్యాపారి కస్తూరి మనోహర్ – వెంకటలక్ష్మి దంపతులు, వ్యాపారవేత్త సాక పాండురంగ – జయలక్ష్మి దంపతులు, పోలీసు శాఖలో ఉద్యోగి గోరంట్ల రాజ్‌కుమార్ – సంధ్య దంపతులు హోమంలో పాల్గొన్నారు.


ఇక ఆలయ కమిటీ సభ్యులు రూ.16 వేలు విలువచేసే వాటర్ డిస్పెన్సర్‌ను ఆలయానికి విరాళంగా అందజేశారు.

మూడో రోజు హోమంలో పాల్లొన్న వారి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి Klic Monvex




