నంద్యాలలో ఘనంగా ‘ప్రతిభకు పట్టాభిషేకం’

2024-25 సంవత్సరానికి టెన్త్, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆదివారం (జూన్ 1వ తేదీ) అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపం‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదో తరగతిలో మొదటి, రెండో, మూడో విజేతగా నిలిచిన జేరుబండి హారిక, కోటా సంజయ్‌, తాటికొండ సాయి సందేష్‌కు వరుసగా రూ.10వేలు, రూ.7,500, రూ. 5వేలు అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చేపూరి క్రిష్ణ చైతన్య, దండు స్వీకృతి, గడ్డం సాయి మణిదీప్‌కి వరుసగా రూ.10వేలు, రూ.7,500, రూ. 5వేలు అందజేశారు. కన్సోలేషన్ బహుమతిగా 110 మంది విద్యార్థులకు ఒక్కొక్కరిని రూ. 2వేల చొప్పున నగదు, ప్రశంసా పత్రం, మెమొంటో అందజేశారు.

‘కన్నవారు తలెత్తుకునేలా…’
విశిష్ట అతిథిగా విచ్చేసిన రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఉడత వెంకట బసవరావు కార్యక్రమానుద్దేశించి ప్రసంగించారు. లక్ష్య సాధనకు విద్యార్థులు కష్టపడి చదివాలన్నారు. అత్యుత్తమ ప్రతిభతో తల్లిదండ్రుల పేరు నిలబెట్టాడంతో పాటు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

వీసీ వెంకట బసవరావును సన్మానిస్తున్న సంఘ సభ్యులు..

మరో విశిష్ట అతిథి రాయలసీమ ప్రాంతీయ పద్మశాలీ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కష్టపడి చదివి సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.

కొంకతి లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న సంఘ సభ్యులు..

ఈ కార్యక్రమానికి భీమన‌పల్లె వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతోఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కులస్థులకు, ముఖ్యంగా ఆర్థిక సాయం చేసి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఉగాది పురస్కార అవార్డు గ్రహీతకు సన్మానం..
పద్మశాలి సంఘంతో పాటు రెడ్‌క్రాస్ సొసైటీలో సేవలందిస్తున్న ఉగాది పురస్కార అవార్డు గ్రహీత నారాయణ నాగ‌శేషయ్యను సంఘం సభ్యులు సన్మానించారు. శాలువ కప్పి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు

నారాయణ నాగ‌శేషయ్యను సన్మానిస్తున్న సంఘ సభ్యులు..

దండు స్వీకృతికి మెమెంటో అందజేస్తున్న వెంకట బసవరావు, కొంకతి లక్ష్మీనారాయణ

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్, కార్యవర్గ సభ్యలు వెంకట రామయ్య, సాదు సూర్యనారాయణ, శిరసాల రామచంద్రుడు, చెన్నా వెంకటేశ్వర్లు, సింగరి సురేష్, సోమా బ్రహ్మానందం గుర్రం కృష్ణవేణి పాల్గొన్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

(పద్మశాలీ, కుర్ణిశాలీ, దేవాంగ, తొగట తదితర చేనేత కులాల సమాచారాన్ని పంపగలరని మనవి) Kärna Fintrix

Follow us on social media

Related posts