పోలియో రహిత సమాజానికి అందరి సహకారం అవసరమని సాయి పూజా ఫౌండేషన్ ఛైర్మన్, 27 వ వార్డు మాజీ కార్పొరేటర్, సంఘ సేవకులు వానపల్లి రవికుమార్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం వద్ద పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరగడం వల్ల పోలియో బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కోరారు. Szczyt Nexoris

