కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..

చేనేతమిత్ర: జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగ‌స్టు 7) పుర‌స్కరించుకొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అవార్డులను ప్రదానం చేయనుంది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ ఒక ప్రకటనలో కోరారు. చేనేత వృత్తిలో ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రం, జ్ఞాపక అందజేస్తారని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయసు ఉండి, 10 సంవత్సరాల అనుభవం ఉండాలని, అలాగే చేనేత డిజైనర్లు 31.12.2025 నాటికి 25 సంవ‌త్సరాల వయసు పూర్తయి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 31లోపు తమ దరఖాస్తులను ఆయా జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ…

అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

చేనేతమిత్ర ప్రతినిధి: అనంతపురం జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతుల లక్ష్మీనరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ హాజరై నూతన అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ప్రతిపాదించారు. అనంతపురం పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరసింహులు, రాయదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు అరవ శివప్ప, కళ్యాణదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశులు, గుంతకల్లు పద్మ శాలి సంఘం అధ్యక్షుడు పాలాది రామసుబ్బయ్య, తాడిపత్రి పద్మశాలి సంఘం సభ్యులు, ఉరవకొండ పద్మశాలి సంఘం సభ్యులు, యాడికి పద్మశాలి సంఘం సభ్యులు, బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం సభ్యులు, సిండికేట్ నగర్ పద్మ శాలి సంఘం సభ్యులు, గుంతకల్లు పద్మశాలి సంఘం సభ్యు‌లు,…

తెలంగాణలో 2,996 వార్డులకు 28,456 నామినేషన్లు..

చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు 30వ తేదీన భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 2,996 వార్డులకు మూడు రోజులు కలిపి 28,456 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపాలిటీ 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి సామల ప్రసన్న సత్యపాల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు పట్టణంలో 45 వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థిగా జనసేన…