నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 20వ తేదీ పద్మశాలీ వధూవరుల పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు పద్మశాలీ తెలంగాణ రాష్ట్రం సంఘం ఉపాధ్యక్షులు దాసరి నర్సింహులు తెలిపారు. నిజామాబాద్ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం పూలాంగ్ సమీపంలో ఉన్న విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పెళ్లీడు వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు తల్లి దండ్రులతో వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన వారైతే 9848082787, 9848047026కు, కామారెడ్డి జిల్లా వారయితే 9397322366, 9347539254ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితంగా నిర్వహించే ఈ వధూవరుల పరిచయ వేదికను పద్మశాలీయులంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం పరిచయ వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు వంగ గణేశ్, ఇప్పకాయల హరిదాస్, ఇరుమల శివలింగం, రాజేశ్వర్ పాల్గొన్నారు.
అక్టోబర్ 20వ తేదీ ఉచిత పద్మశాలీ వధూవరుల పరిచయ వేదిక

