హైదరాబాద్ పద్మశాలి విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కందగట్ల మనోహర్ ఇటీవల పంజాగుట్టలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సమాజాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథిగా హాజరైన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేష్ విశ్రాంత ఉద్యోగుల ఐక్యతను ప్రశంసించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొండా యాదగిరి, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి నర్సింగరావు, సలహాదారులు దోర్నాల విజయకుమార్, జగదీశ్వర్, గెంట్యాల రామచంద్రం, భువనగిరి ఉదయ్ కుమార్ దిడ్డి విజయకుమార్, వల్లందాస్ చక్రపాణి, కనకాల సదానందం, బాసబత్తిని రాజేశం, శిరందాస్ యాదగిరేందర్, డాక్టర్ లక్ష్మన్, శ్రీనివాసులు, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
పద్మశాలి విద్యార్థి సంఘం వరంగల్ జిల్లా కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం వరంగల్ జిల్లా కమిటీ క్యాలెండర్‌ను బి.సి నేత హాస్టల్‌లో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మెండు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పద్మశాలి విద్యార్థుల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చింతకింది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మెండు మృత్యుంజయ, ప్రధాన కార్యదర్శి గడ్డం క్రాంతి రణధీర్, ఉపాధ్యక్షులు అమూల్య, ఉద్యోగ సంఘం నాయకులు సతీష్, కోడం రవి ప్రకాష్, ములుక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. Polska Bitradex

